విద్యుత్ ట్రూ ఆఫ్ చార్జీలు వెనుక "బాబు-ఆదానీ కిట్ ప్రోకో అవినీతి" -సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్

Jul 21, 2025 - 17:10
 0  10
విద్యుత్ ట్రూ ఆఫ్ చార్జీలు వెనుక "బాబు-ఆదానీ కిట్ ప్రోకో అవినీతి" -సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్
సదస్సులో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్
  • ఆదానీ కంపెనీతో కూటమి ప్రభుత్వం "సేకీ ఒప్పందం" రద్దు చేయాలి.
  • ప్రజలపై విద్యుత్ భారాలు వేయటంలో వైసీపీ బాటలోనే టిడిపి నడుస్తోంది.
  •  విద్యుత్ ట్రూ ఆఫ్ చార్జీలు వెనుక "బాబు-ఆదానీ కిట్ ప్రోకో అవినీతి" ఉంది.
  •  "సోలార్ విండో విద్యుత్" యూనిట్ 4.75 పైసలు నుండి రూ 7 కు, 25 సం.కు ఒప్పందం ప్రమాదం.
  • సెల్ ఫోన్స్ రీఛార్జ్ లాగా విద్యుత్ రీఛార్జ్ ఆదాని కి ప్రభుత్వం అనుమతించింది. 

.

---------------------------------------------

స్మార్ట్ మీటర్లు-ఆదానికి* *వరం-రాష్ట్ర* *ప్రజలకు శాపం".* అనే అంశంపై "*ప్రాంతీయ సదస్సును ఉద్దేశించి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు), సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ... 1998 లో నాటి ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణల పేరిట ప్రైవేట్ రంగాన్ని ప్రవేశపెట్టి ప్రజలపై మోయలేని విద్యుత్ చార్జీల భారాన్ని ప్రారంభించారన్నారు. ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చి "బషీర్బాగ్ ప్రజా ప్రతిఘటన"పై కాల్పులు జరిగారని ముగ్గురు సిపిఎం కార్యకర్తలు అమరులైనారని గుర్తు చేశారు. వై.యస్.రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా నాడు కమ్యూనిస్టుల ఉద్యమానికి మద్దతు తెలియజేసి, అధికారంలోకి వచ్చాక అదే విద్యుత్ సంస్కరణలను అమలు చేసి ప్రజలపై భారాలు కొనసాగించారని గుర్తు చేశారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ సీ.ఎం. గా మళ్లీ టిడిపి అధికారంలోకి రావటంతో విద్యుత్ భారాలు కొనసాగించారన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు వాగ్దానం చేసి మాట నిలబెట్టుకోలేదని అన్నారు. 5 సంవత్సరాల ఆయన పరిపాలనలో ఆయన జోబి విద్యుత్తు కాంట్రాక్ట్ సంస్థలను ప్రవేశపెట్టి వారికి వేలకోట్ల విద్యుత్తు కాంట్రాక్టులు అప్పగించి ప్రజాధనాన్ని పరోక్షంగా లబ్ధి పొందారన్నారు. ఆదానితో సోలార్ విండో విద్యుత్తు ఒప్పందాలు మరొకసారి పునరుద్ధరించుకొని యూనిట్ విద్యుత్తు 2.45 ఉండగా ఒకే మారు 4.75 పైసలకు అమాంతంగా పెంచి ప్రజాతనాన్ని దోచుకోవడానికి కార్పొరేట్ సంస్థలకు అవకాశం కల్పించాలన్నారు. ఆదాని కంపెనీల లక్ష కోట్ల లబ్ధి చేకూర్చి వారి నుండి కిట్ ప్రోకో పద్ధతిలో 32 వేల కోట్లు వైసిపి ప్రభుత్వం ఎన్నికల నిధుల లబ్ధి పొందిందని పత్రికల్లో రాస్తున్నారని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి, బిజెపి, జనసేన ఎన్డీఏ కూటమి తిరిగి అధికారులకు వచ్చాక, 2024- 2025 "సేకి విద్యుత్తు ఒప్పందాలు" ఆదానే కంపెనీలతో, భవిష్యత్తు 25 సంవత్సరాలకు యూనిట్ విద్యుత్తు7 రూపాయలకు పెంచుకొని విక్రయించేందుకు ఒప్పందం చేసుకొని 1 లక్ష, 50 వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారాలు వేసి, ప్రజలు నిలువు దోపిడీ చేయడానికి ఆదానికి లైసెన్సు ఇచ్చారని ఇందులోనూ ఆదాని కూటమి నాయకుల మధ్య కిట్ ప్రోకో అవినీతి జరిగిందని ఆరోపించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ.శివకుమార్ , జిల్లా కమిటీ సభ్యులు పి.చాన్ బాషా లు మాట్లాడారు. బద్వేల్ పట్టణ కమిటీ మోక్షమ్మ, బాబు, చిన్ని, షరీఫ్, శివ, సుబ్బరాయుడు, రాయప్ప, శాఖ కార్యదర్శులు బాలమ్మ, మస్తాన్ బి, కొండయ్య, మోరా ప్రసాద్ , బద్వేల్ రూరల్ కమిటీ కార్యదర్శి దాసరి వెంకటేష్, జయరాజ్ కృష్ణ, యానాదయ్య, వెంకటేష్, సరస్వతి, పుష్ప, మరియమ్మ, అట్లూరు కమిటీ కన్వీనర్ రమణయ్య, దుర్గమ్మ, రవిచంద్ర, స్వప్న, లతా, గంగయ్య , సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0