నామినేటెడ్ పదవులన్నీ పూర్తి చేసి నేతల్లో నూతనోత్సవం నింపాలి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట (జూలై 11) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజలకి ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సుపరిపాలన పరంగా మంచి పేరును తెచ్చుకుంటోంది. ప్రభుత్వ కార్యకలాపాలకు మద్దతుగా వివిధ కార్పొరేషన్ల నామినేటెడ్ పదవులను చాలా వరకు భర్తీ చేశారు. అయితే, ఇంకా రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో గ్రామ మరియు పట్టణ స్థాయిలో దేవాలయ, మార్కెట్ యార్డ్, సొసైటీ, బ్యాంకులు, హాస్పిటల్స్‌కి సంబంధించిన పదవులు ఖాళీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆశావాహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.
ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న నేటికి నామినేటెడ్ పదవుల్లో జాప్యం జరుగుతుండటంతో, టీడీపీ క్యాడర్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత వైసీపీ పాలనలో చోటుచేసుకున్న అరాచకాలకు నిరసనగా ఆనాడు టీడీపీ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించిన విషయం తెలిసిందే. దాంతో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచే స్థానాల్లో కూడా పోటీ బహిస్కరించడంతో తెలుగు తమ్ముళ్ళు ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు దూరమయ్యారు. ప్రస్తుతం ఎంపీటీసీ, జడ్పీటీసీ లుగా ఉన్నవారంతా వైసీపీ వారే.నేటి కూటమి ప్రభుత్వంలో కూడా అప్పట్లో గెలిచిన వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులే గ్రామస్థాయిలో ప్రభావం చూపిస్తున్నారు. దీంతో తెలుగుతమ్ముళ్ళలో నిరాశ నెలకొంది. ఆనాటి వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ పార్టీ కార్యకర్తలు పై పెట్టిన అక్రమ కేసులుతో, ఇబ్బంది పడ్డ తెలుగు తమ్ముళ్ళు సమయం కోసం ఎదురు చూపులు తప్పడం లేదు.
ఒక పక్క స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను గత వైసీపీ ప్రభుత్వం 24 శాతానికి కుదించింది. బీసీలకు రాజకీయంగా నష్టం కలిగించింది. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీ సామాజిక వర్గాల నేతలు నామినేటెడ్ పదవులపై తీవ్ర ఆశలు పెట్టుకున్నారు. కానీ, పదవుల నియామకంలో ఆలస్యం కారణంగా వారిలో అసంతృప్తి నెలకొంటుంది.
ఇక యువత విషయానికి వస్తే ఆనాటి వైసీపీ అరాచకాలను తట్టుకుని "తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షం నుంచి అధికారంలోకి తీసుకురావడంలో యువత కీలక పాత్ర పోషించింది. అయినప్పటికీ, నామినేటెడ్ పదవుల్లో యువతకు తగిన స్థానం దక్కలేదు అనేది వాస్తవం.కేవలం యువత ప్రచార కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అయ్యారు.
కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీల కీలక నేతలకు నామినేటెడ్ పదవుల కేటాయింపు వల్ల సమయం ఆలస్యం అవ్వుతున్నప్పటికీ ఇప్పటికే చాలామంది యువత,కార్యకర్తలు,భవిష్యత్ రాజకీయ ఆశావహులు ఆశగా నామినేటెడ్ పదవులు కోసం ఎదురుచూస్తున్నారు. అందువల్ల మిగిలిన నామినేటెడ్ పదవుల ప్రక్రియను పారదర్శకంగా, సామాజిక న్యాయం పాటించేలా త్వరగా పూర్తి చేయడం ద్వారా పార్టీకి అంకితభావంతో పనిచేసిన క్యాడర్‌కు నూతనోత్సాహం కలుగుతుందని పార్టీకి మరింత బలం చేకూరుతుందని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు బొక్కా ప్రసాద్ ఆయన అభిప్రాయం వ్యక్తపరిచారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
2
Funny
0
Angry
0
Sad
0
Wow
0