గ్రామ స్థాయి వరకు జన్ సురక్ష స్కీములను తీసుకువెళ్లండి- జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి..
- జూలై నుండి సెప్టెంబర్ 30 వరకు స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహణ
- జిల్లా వ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ లో భాగంగా ప్రతి బుధవారం అవగాహన కార్యక్రమాల నిర్వహణ*
- ఇందుకు తగు కార్యాచరణ ప్రణాళిక తో ముందుకు వెళ్దాం
- ఈ- కేవైసీ అప్డేషన్ వేగంగా జరగాలి..
- బ్యాంక్ అధికారులు, డిఆర్డిఏ,మెప్మా,డ్వామా శాఖ లతో సమన్వయం చేసుకొని వెళ్లండి
వైయస్సార్ కడప,మహి న్యూస్ జూలై 4: ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన,అటల్ పెన్షన్ యోజన పథకాలను గ్రామ స్థాయి వరకు తీసుకొని వెళ్లి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఇందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని ఈ అవగాహన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఎల్ డి ఎం ను ఆదేశించారు.
శుక్రవారం జిల్లా సచివాలయం లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జన్ సురక్ష పథకాలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా ఈనెల ఒకటి నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కు సంబంధించి సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్ సురక్ష పథకాలైన ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్లి నమోదు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఇందుకు తగు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని ఎల్ డి ఎం ను ఆదేశించారు.
ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ఖాతాలు లేని కుటుంబాలను గుర్తించి, వారిచే బ్యాంకు ఖాతాలను తెరిపించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ను జిల్లాస్థాయి నుండి గ్రామస్థాయి వరకు సమర్థవంతంగా నిర్వహించడంలో సంబంధిత శాఖలైన డిఆర్డిఏ, మెప్మా మరియు డ్వామా శాఖలను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని తెలిపారు. ప్రతి గ్రామంలో ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించిన విషయాన్ని ముందుగా ప్రజలకు తెలియజేయాలన్నారు. బ్యాంకులకు సంబంధించిన సమస్యలు ఉన్నవారితో పాటు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఆసక్తి ఉన్నవారు అందరూ హాజరవుతారని తెలిపారు.
ఈ కేవైసీ చేయనివారిని గుర్తించి ఈ కేవైసీ అప్డేషన్ ప్రక్రియను వేగంగా చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జన్ సురక్షా పథకాల గురించే కాకుండా ఆర్థిక అక్షరాస్యత పై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రస్తుత పరిస్థితులలో సైబర్ మోసాల పై ప్రజలకు అవగాహన కల్పించడం కూడా ముఖ్యమన్నారు. గ్రామీణ ప్రాంతాలలో డిఆర్డిఏ, అర్బన్ పరిధిలో మెప్మా శాఖల ద్వారా ఎస్ హెచ్ జి మహిళలను భాగస్వాములను చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు అవకాశం ఉందన్నారు.డ్వామా ద్వారా ఉపాధి కూలీలకు బ్యాంకు ఖాతాలు తెరవడం చేయాలన్నారు. పెన్షన్ ఖాతాలను బ్యాంకు ఖాతాలు తెరవడం చేయవచ్చునన్నారు.
ఈ క్యాంపెయిన్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి బుధవారం అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, మొదటి విడతలో భాగంగా జులై 23, 30, ఆగస్టు 6 తేదీలలో ప్రతి గ్రామస్థాయిలో సమావేశాల నిర్వహణ చేపట్టాలన్నారు. రెండవ విడత మూడవ విడతలో చేసే కార్యక్రమాలలో మొదటి విడతలో జిపి లలో లోటుపాట్లను సరిదిద్దుకొని పనిచేయాలన్నారు. గ్రామస్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలన్నారు.
ఈ సమావేశంలో ఎల్డీఎం జనార్ధన, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు చంద్ర నాయక్, రవి చంద్ర బాబు,ఆర్ ఎం యూనియన్ బ్యాంక్ లక్ష్మీ తులసి, నాబార్డ్ డిడిఎం విజయ విహారి, ఆర్ ఎం ఎస్ బి ఐ కృష్ణ కిషోర్, వివిధ బ్యాంకు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0