రైతులు జాయింట్ పట్టాను విడివిడిగా విభజన చేయించుకోండి- తాసిల్దార్ బాబు రాజేంద్రప్రసాద్
చిత్తూరు జిల్లా / బంగారుపాళ్యం జూన్ 20: చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో రీ-సర్వే పూర్తైన గ్రామాలలో వెబ్ ల్యాండ్ 2.0 లో జాయింట్ పట్టాదారులుగా నమోదు అయిన భూ యజమానులకు సంతోషకర సమాచారాన్ని ప్రభుత్వం తెలిపినట్లు తాసిల్దార్ బాబు రాజేంద్రప్రసాద్ తెలిపారు.రీ - సర్వే పూర్తి కాబడిన గ్రామముల యందు వెబ్ ల్యాండ్ 2.0 లో జాయింట్ పట్టాదారులుగా నమోదు కాబడిన భూ యజమానులు వారి యొక్క భూములను విభజన చేయుటకు ప్రభుతము వారు నిర్దేశించిన 500 రూపాయల రుసుమును పూర్తిగా మినహాయించి ఉచితముగా ఈ సేవను పొందుటకు అవకాశము కల్పించియున్నారు. దీనికి గాను కేవలము నామమాత్రపు దరఖాస్తు రుసుము 50 రూపాయలను గ్రామ సచివాలయము నందు చెల్లించి జూన్ 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ సదవకాసమును జాయింట్ పట్టాదారులు అందరూ ఉపయోగించుకొని జాయింట్ పట్టాలను విడివిడిగా విభజన చేయించు కోవలసినదిగా కోరారు. దీనివలన ప్రభుత్వ సంక్షేమ పధకములైన “అన్నదాత సుఖీభవ” “తల్లికి వందనం” ఇతర ప్రభుత్వ సంక్షేమ పదకములకు అర్హులుగా గుర్తించబడుదురు.
“అన్నదాత సుఖీభవ” పధకములో ఇబ్బంది వున్నవారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే ప్రాధాన్యత ఇవ్వబడునని తాసిల్దార్ బాబు రాజేంద్రప్రసాద్ తెలియజేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0