మా భూమి ఆక్రమణకు గురికాకుండా చూడాలని వినతి... జార్జీపేటలో తల్లీ కొడుకులు ఆవేదన
కాకినాడ జిల్లా,తాళ్లరేవుమండలం, మహి న్యూస్, (సెప్టెంబర్ 23) ;
తాత ముత్తాతల కాలంనుంచి ఉన్న మా పూర్వాసిని కొందరు అధికారుల సహాయంతో ఆక్రమించాలని చూస్తున్నారని తల్లీ కొడుకులు ఆవేదన వ్యక్తం చేసారు. మండల పరిధిలోని జార్జీపేట గ్రామానికి చెందిన దంగేటి మహాలక్ష్మి, ఆమె కుమారులు దంగేటి నీలాద్రి, నాగ దుర్గాప్రసాద్‌లు తమ జరుగుతున్న అన్యాయాన్ని మంగళవారం విలేకర్ల వద్ద వాపోయారు. జార్జీపేట-పోలేకుర్రు సరిహద్దులో జార్జీపేట గ్రామంలో ఉన్న సర్వే నెంబరు 5-1లో తమకు గల 16 సెంట్ల భూమిలో రెండు సెంట్ల భూమిని రహదారిపేరుతో ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. అధికారులను తప్పు దారిపట్టించి తమ భూమిని కబ్జా చేయాలని పిల్లి భాస్కరరావు, గుత్తుల సత్యన్నారాయణ తదితరులు చూస్తున్నారని ఆరోపించారు. 1932లో కొనుగోలు చేసి పక్కా డాక్యుమెంట్లు ఉన్న భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నా. అధికారులు ఒత్తిళ్లతో వారికే సహాయం చేయడం దారుణమన్నారు. దీనిపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించామని, ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చిందని తెలిపారు. అయితే కోర్టు ఆర్డర్‌ను ధిక్కరించి స్థలాన్ని ఖాళీ చేయాలని పంచాయతీ కార్యదర్శి గ్రామంలో దండోరా వేయించారని ఆవేదన వ్యక్తం చేసారు. జిరాయితీ భూమి జోలికి వస్తే కోర్టు ధిక్కార కేసును వేస్తామని వారు హెచ్చరించారు. దీనిపై తహసీల్దార్ పితాని త్రినాధరావును వివరణ కోరగా గ్రామానికి చెందిన కొందరు తమకు దారి సౌకర్యం లేదని, జిల్లా కలెక్టర్‌కు విన్నవించారని. ఆ చర్యల్లో భాగంగా బాలీ చేయిస్తున్నట్లు తెలిపారు. ఆ స్థలానికి సంబంధించి పూర్తిస్థాయి డాక్యుమెంట్లు. కోర్టు ఆర్డర్లను చూపించలేదని, అందువల్లే స్థలం బాళీ చేయాలని దండోరా వేయించినట్లు తహసీల్దార్ త్రినాథరావు తెలిపారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0