రష్యా లో కుప్పకూలిన విమానం 49 మంది మృతి!!!!

RUSSIAN PASSENGER PALEN CRASHED NEAR CHINA BORDER OF RUSSINA 49 FEARLY DIED !

Jul 24, 2025 - 14:55
Jul 24, 2025 - 14:56
 0  78
రష్యా లో కుప్పకూలిన విమానం 49 మంది మృతి!!!!

రష్యాలోని ఫార్ ఈస్ట్‌లో దాదాపు 49 మందితో ప్రయాణిస్తున్న An-24 ప్యాసింజర్ విమానం టేకాఫ్ అయిన కొంత సేపటికే ఎయిర్ ట్రాఫిక్ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఎయిర్ ట్రాఫిక్ అధికారులు దీనిపై రంగంలోకి  దిగి విమానంలో తిరుగూతూ ప్రత్యేకంగా దళాల్ని రంగంలోకి దింపారు.

ఎయిర్ పోర్టుకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు గుర్తించారు. ప్రమాద తీవ్రతను గమనిస్తే ప్రయాణికులలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు.

GET LATEST OFFERS

అంగారా ఎయిర్‌లైన్‌కు చెందిన ఏఎన్‌-24 విమానం గురువారం ఉదయం బ్లాగోవెష్‌చెన్స్క్‌ నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయల్దేరింది. ఇందులో ఐదుగురు చిన్నారులతో పాటు మొత్తం 49 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.టిండాలోని ఎయిర్ పోర్టులో పైలట్ ల్యాండింగ్ కు ప్రయత్నించగా సాధ్యంకాలేదని గుర్తించారు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టుకు 15 కిలోమీటర్ల దూరంలో విమానం కుప్ప  కూలిపోయిందని అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0