ఖలిస్థానీలపై కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ
ఇంటర్నెట్ డెస్క్: ఖలిస్థానీలపై (Khalistani Extremism) భారత్ ఎంతో కాలంగా చేస్తున్న ఆరోపణలు వాస్తవమని కెనడా ఇంటెలిజెన్స్ వర్గాలు ధ్రువీకరించాయి. కెనడాను తమ స్థావరంగా మార్చుకుని ఖలిస్థానీలు భారత్లో హింసను ప్రేరేపిస్తున్నారని కెనడా నిఘా సంస్థ సీఎస్ఐఎస్ (Canada Intelligence Agency) అధికారికంగా నివేదిక వెలువరించింది. కెనడాలో నిధులు సమీకరించి, ప్రణాళికలు రచించి భారత్లో హింసను ప్రోత్సహిస్తున్నారని పేర్కొంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0