ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ ఇరాన్

Jun 19, 2025 - 17:57
 0  7
ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ ఇరాన్

ఇజ్రాయెల్‌, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. గురువారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీగా బాలిస్టిక్స్ క్షిపణులు ప్రయోగించింది. ఇవి దక్షిణ ఇజ్రాయెల్‌లోని సొరొకలో ఆసుపత్రిని తాకాయి. దీంతో ఆ ఆసుపత్రిలోని పలు భాగాలు ధ్వంసమైనాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది స్పందించారు. ఈ దాడిలో ఆసుపత్రిలోని పలు విభాగాలు దెబ్బతిన్నాయని తెలిపారు. అలాగే పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయని చెప్పారు. మొన్నటి వరకు ఈ ఆసుపత్రిలో రోగులు భారీ సంఖ్యలో ఉన్నారని.. వారిని నిన్ననే మరో ప్రాంతానికి తరలించామని చెప్పారు. అందువల్లే ఎవరూ మృతి చెందలేదని పేర్కొన్నారు. అయితే ఆసుపత్రిని ప్రస్తుతానికి మూసి వేసినట్లు ప్రకటించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0