బాలల హక్కుల పరిరక్షణకు అంకితభావంతో కృషి చేయాలి-ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఏపీఎస్సీపీఆర్) సభ్యురాలు బి.పద్మావతి

Jul 4, 2025 - 15:56
 0  10
బాలల హక్కుల పరిరక్షణకు అంకితభావంతో కృషి చేయాలి-ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఏపీఎస్సీపీఆర్) సభ్యురాలు బి.పద్మావతి

వైయస్సార్ కడప జిల్లా/కడప, మహి న్యూస్ జులై 04:  బాలల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బి.పద్మావతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ హాల్లో ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యురాలు బి.పద్మావతి అధ్యక్షతన బాలల హక్కుల పరిరక్షణ, వారి కోసం ఉద్దేశించిన చట్టాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  

ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బి.పద్మావతి మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమీషన్ విధులను, ఆవశ్యకతను తెలిపారు. బాలల హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పిల్లల పట్ల  సున్నితత్వంతో మెలిగాలని సూచనలు చేశారు. ప్రధానంగా సంక్షేమ హాస్టల్ లలో మౌలిక వసతులు మెరుగుపర్చాలన్నారు.అలాగే సంక్షేమ హాస్టల్ లలో కంప్లైంట్ బాక్స్ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు.అన్ని కమిటీలకు రిజిస్టర్స్ నిర్వహణ చేపట్టాలన్నారు. ప్రహరీ క్లబ్స్  (డ్రగ్ అబ్యూస్), ప్రొటెక్షన్,ఎడ్యుకేషన్,పేరెంట్స్,హెల్త్ కమిటీలు పాఠశాలలోనే  కాకుండా వెల్ఫేర్ హాస్టల్ లలో  కూడా ఏర్పాటు చేయాలన్నారు. కమిటీల ఏర్పాటు లో నిర్లక్ష్యం వహిస్తే కమిషన్ తరుపున చర్యలు తీసుకుంటామన్నారు.

బాలల హక్కులు, చట్టాల అమలు తీరును పర్యవేక్షించేందుకు వీలుగా జాతీయ, రాష్ట్ర స్థాయిలలో కమిషన్ లు పని చేస్తున్నాయని తెలిపారు. క్షేత్ర స్థాయిలో బాల సంరక్షణ, వారి హక్కుల పరిరక్షణ పూర్తి స్థాయిలో జరిగేలా పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని అధికారులకు సూచించారు. అందులోనూ ఏవైనా లోపాలు ఉంటే వాటిని సవరించుకుంటూ ముందుకు సాగాలన్నారు.సంరక్షణ కేంద్రాల్లో, సంక్షేమ  హాస్టల్ లలో వున్న బాలలను సొంత బిడ్డల్లాగా వారి బాగోగులు చూడాలన్నారు. వారికి మంచి విద్య అందేలా చూడాలన్నారు. మన కర్తవ్యాన్ని సమర్ధవంతంగా నిర్వర్తించినప్పుడే భావి భారత పౌరులైన బాలల భవితవ్యానికి బంగారు బాటలు వేసినట్లవుతుందని అన్నారు.

పిల్లలు తమకు ఎదురయ్యే ఇబ్బందులు, బాధల గురించి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారని అందువల్లే రాజ్యాంగం ద్వారా బాలలకు ప్రత్యేకంగా హక్కులు కల్పించబడ్డాయని తెలిపారు. సమాజ మార్పులకు అనుగుణంగా ప్రభుత్వాలు సైతం ఎప్పటికప్పుడు కొత్తగా బాలల కోసం చట్టాలను రూపొందిస్తూ అమలు చేస్తున్నాయని అన్నారు. పిల్లల సమస్యల కొరకు 1098 టోల్ ప్రీ నంబర్ కి ఫోన్ చేసినట్లయితే వాటిని పరిష్కరిస్తామని తెలియజేశారు.ఈ కార్య్రమంలో సోషల్ వెల్ఫేర్ డిడి సరస్వతి, ఐసిడిఎస్ పిడి శ్రీలక్ష్మి,బీసీ వెల్ఫేర్ డిడి అంజల,మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ హిదియతుల్లా, ఉమెన్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ బాల స్వామి,జిల్లా బాలల సంరక్షణ అధికారి సుభాష్ హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, సహాయ సాంఘిక వెల్ఫేర్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0