పాల కనకదుర్గమ్మ ఆలయంలో వైభవంగా బాలపూజ - బాలాత్రిపుర సుందరి అలంకరణలో విశేష పూజలు

Sep 24, 2025 - 10:00
 0  1
పాల కనకదుర్గమ్మ ఆలయంలో వైభవంగా బాలపూజ - బాలాత్రిపుర సుందరి అలంకరణలో విశేష పూజలు

కాకినాడ జిల్లా,తాళ్లరేవు మండలం, మహి న్యూస్  ( సెప్టెంబర్23) :

పి.మల్లవరం పంచాయతీ శివారు గ్రాంటు గ్రామంలో యానాం- గిరియాంపేట రహదారి చెంతన వేంచేసియున్న శ్రీ పాల కనకదుర్గమ్మ ఆలయంలో బాలపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శరన్నవరాత్రి మహోత్సవాల రెండవ రోజైన మంగళవారం దుర్గా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పలు ఆలయాలు, మంటపాల్లో అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించి విశేష పూజలు చేసారు. వీటిలో భాగంగా గ్రాంటు గ్రామంలో పాల కనకదుర్గమ్మ ఆలయంలో ఆర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో శ్రీసూక్త విధానంలో బాలికను బాలాత్రిపుర సుందరిగా అలంకరించి షోడషోపచార పూజలు నిర్వహించారు. కొప్పిశెట్టి రవి, కర్రి సత్యానందం దంపతులచే ఆశేష భక్తుల నడుమ బాలికకు పాదపూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ఊయలలో ఊపుతూ పాటలు పాడుతూ పూజలు చేసారు. పూజలో పాల్గొన్న చిన్నారులకు కుంకుమ, కాటుక తదితర అలంకార వస్తువులతో కూడిన కిట్లను అందజేసారు. తొలుత సామూహిక కుంకుమ పూజలు చేసారు. అధిక సంఖ్యలో భక్తులు ఆయా పూజా కార్యక్రమాలను తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0