అవును.. నిజమే, చివరకు మౌనం వీడిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్

Jun 19, 2025 - 17:45
 0  4
అవును.. నిజమే, చివరకు మౌనం వీడిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ, కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. పార్టీతో తనకు కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరైనా తనను సంప్రదించినప్పుడు ఈ విభేదాలను ప్రైవేట్‌గా చర్చిస్తానని థరూర్ అన్నారు. 'నేను గత 16 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్నాను. పార్టీతో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి.. నేను వాటిని పార్టీ లోపల చర్చిస్తాను. ఈ రోజు దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నేను కలుసుకుని మాట్లాడాలి, సమయం రావాలి, అప్పుడు దాని గురించి చర్చిస్తాను.' అని ఎంపీ థరూర్ కేరళ తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 

ఇలా ఉండగా, ఈ నెల ప్రారంభంలో భారత ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ ఔట్ రీచ్ కార్యక్రమంలో శశిథరూర్ చురుగ్గా పాల్గొన్న సంగతి తెలిసిందే. అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ విదేశాలలో పహల్గాం దాడి, తర్వాత ఆపరేషన్ సిందూర్ తదితర పరిణామాల్ని.. ఉగ్రవాదంపై భారత స్టాండ్‌ను ప్రపంచానికి చాటి చెప్పారు శశిథరూర్. పలు దేశాల్లో పర్యటించి భారతదేశం మీద పాకిస్థాన్ చేస్తున్న పన్నాగాల్ని, కుట్రల్ని, భారత్ పడుతున్న ఇబ్బందుల్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు.

కాగా, జూన్ 10న, శశి థరూర్ ప్రధాని మోదీతో తన సమావేశాన్ని 'మంచి, ఉల్లాసమైన అనధికారిక' భేటీగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి మోదీ న్యూఢిల్లీలోని తన నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఆపరేషన్ సిందూర్ ఔట్ రీచ్ అఖిలపక్ష ప్రతినిధుల సభ్యులను కలిసిన అనంతరం శశి ఈ వ్యాఖ్యలు చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0