తిరుపతి ,మహి న్యూస్, మార్చి 19:
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం ఉగాది ఉత్సవం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా టీటీడీ పంచాంగ పరిష్కర్త మరియు ఆగమ సలహా మండలి అధ్యక్షులు వేదాంతం విష్ణు భట్టాచార్యులు పంచాంగ శ్రవణం చేస్తూ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములను తెలుసుకోవడమే పంచాంగమన్నారు. పూర్వం రాజులు ప్రతిరోజూ పంచాంగ శ్రవణం చేసేవారని, ఇది ఎంతో పుణ్యఫలమని అన్నారు. శ్రీవేంకటేశ్వరుని భక్తితో సేవిస్తే అన్నీ శుభాలే కలుగుతాయన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. అనంతరం ఆయా రాశుల వారికి ఈ సంవత్సరంలో కలిగే ఫలాలను తెలియజేశారు. అనంతరం పంచాంగకర్తను శ్రీవారి ప్రసాదం, నూతన వస్త్రాలతో సన్మానించారు. ఆ తరువాత ఉదయం 11 నుండి 12:30 గంటల వరకు ఎస్వీ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు ఆచార్య దామోదర్ నాయుడు కవి సమ్మేళనం
నిర్వహించారు.









Be the first to comment.