వైఎస్ఆర్ కడప మహి న్యూస్ , మార్చి 19 : శ్రీ  పరాభవ నామ ఉగాది తెలుగు నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో సాగాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా  ఆకాంక్షించారు.గురువారం జిల్లా కలెక్టరేట్ లోని సభాభావన్ లో...దేవాదాయ ధర్మాదాయ శాఖ,పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శ్రీ  పరాభవ నామ ఉగాది పర్వదినాన్ని  పురస్కరించుకుని..వేద పండితులు శ్రీ చక్రవర్తుల నాగాంజనేయ శర్మవారిచే పంచాంగ పఠనం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా  హాజరయ్యారు.అలాగే ఈ కార్యక్రమానికి అధికారులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా మాట్లాడుతూ.. ఈ తెలుగు సంవత్సరం..  అందరి కుటుంబాల్లో పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలన్నారు.అలాగే సంక్షేమ, సౌభాగ్యాలతో శోభాయమానంగా వెలుగొందాలన్నారు.వర్షాలు సమృద్ధిగా కురిసి పల్లెసీమలు.. పశుసంపద, వ్యవసాయ, ఉద్యాన పంటలతో సుభిక్షంగా కలకళలాడాలని అభిలశించారు. ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకమని సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు మరింత సంతృప్తస్థాయిలో అధికారులు అందజేయాలన్నారు. జిల్లా ప్రజలకు ఆమె శ్రీ  పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు  తెలిపారు.

పంచాంగ శ్రవణం



కడపకు చెందిన శ్రీ చక్రవర్తుల నాగాంజనేయ శర్మ పంచాంగ శ్రవణం చేస్తూ.. ప్రతి ఏడాది ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుందన్నారు. ఈ  ఏడాదిని శ్రీ పరాభవ నామ సంవత్సరంగా జరుపుకుంటున్నామన్నారు.శ్రీ పరాభవ నామ సంవత్సరం అనగా..మనిషిలో ఉన్న 'అహంకారం', 'గర్వం', 'స్వార్థం' పరాభవం పాలు కావడాన్ని  ఇది సూచిస్తుందని అన్నారు. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలను జయించి, వినయంతో ఉండాలని ఈసంవత్సరం మనకు బోధిస్తుందనీ అన్నారు. అహంకారంతో  ఉన్న వ్యక్తులకు ఈ సంవత్సరం గట్టి గుణపాఠం నేర్పుతుందనీ. కానీ... వినయంతో, నిజా
యితీగా, ధర్మబద్ధంగా కష్టపడే వారికి అద్భుతమైన విజయాలను అందిస్తుందన్నారు. జ్యోతిష్య శాస్త్రంలో పరాభవ నామ సంవత్సరం 
చాలా ప్రత్యేకమైనదన్నారు.ఈ సంవత్సరం ఉగాది పచ్చడి కూడా ఆరురుచుల తోపాటు ప్రతికూలత అనుకూలత అనే రెండింటిని సమానంగా చూపుతుందన్నారు.ఎవరు అయితే సవాళ్లను అధిగమించి, సహనంతో ముందుకు సాగుతారో వారికి ఈ సంవత్సరం అదృష్టాన్ని ఇస్తుందన్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి శుభసూచకమని,కరవు కాటకాలు లేకుండా ప్రతి ఒక్కరూ భోగభాగ్యాలతో తులతూగుతారని, పంటలు బాగా పండేలా వాతావరణం అనుకూలిస్తుందన్నారు. జ్యోతిష్యము పంచాంగం అంటే భవిష్య శాస్త్రమ
ని రాబోయే సంవత్సరంలో జరగబోయే కాల జ్ఞానం గురించి తెలుపుతుందన్నారు.ఈ కొత్త ఏడాదిలో అందరికీ శుభ ఫలితాలు రానున్నాయన్నారు. తప్పులు జరగకుండా ముందు జాగ్రతా చర్యగా మేల్కొలిపే శాస్త్రమే జ్యోతిష్య శాస్త్రం అన్నారు.
సృష్టి కి పూర్వ ప్రపంచం చీకటి తో నిండి ఉందేడని ఈ చీకటిని పెద్ద అండం ఈ సృష్టికి మూలం అయిందన్నారు.ఈ అండం నుండి సౌర కుటుంబాలు,పాలపుంటలు, గ్రహాలు,నక్షత్రాలు ఉద్భవించాయన్నారు.చంద్రుణ్ణి వెంటపెట్టుకొని భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ,గ్రహాల్ని సౌర మండలం చుట్టూ తిరుగుతూ... సౌరమండలాల్ని పాలపుంతల చుట్టూ తిరుగుతూ..పాలపుంతలన్నీ ధ్రువ మండలం చుట్టూ తిరుగుతూ ఉంటాయని గ్రహాల గురించి వివరించారు.సాంసృతిక కలలు ఆరోగ్యాన్ని విజ్ఞానాన్ని అందిస్తాయన్నారు.

ప్రభుత్వాలకు అధికారులకు మధ్య సమన్వయం బాగా ఉంటుందన్నారు.  భారతదేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు (ఆరు రుచులు) జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలకు సంకేతాలనీ. కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన అందరూ మంచి, చెడు  ప్రతి అనుభవాన్ని సమానంగా స్వీకరిస్తూ ముందుకెళ్లాలనేదే ఉగాది పచ్చడి తినడం వెనక ఉన్న పరమార్థం అన్నారు.అనంతరం రాశిఫలాల గురించి చదివి వినిపించారు.

ముందుగా వేద పండితులు జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా ముఖ్య అతిథులతో  కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పంచాంగాన్ని ఆవిష్కరించారు.

జిల్లాలో నలుగురు పండితులకు ఉగాది పురస్కారాలు ప్రదానం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది సనాతన ధర్మానికి విశేష సేవలు చేసిన వేదపండితులకు అర్చకులకు, కవులకు అందించే ఉగాది పురస్కారాలు- 2026.. జిల్లాకు చెందిన నలుగురికి వరించాయి. 

ఈ సందర్భంగా..  కడపకు చెందిన శ్రీ చక్రవర్తుల నాగాంజనేయ శర్మ,చాపాడు మండలం అల్లాడపల్లి గ్రామానికి చెందిన శ్రీ భరత్ కుమార్ శర్మ, బద్వేలు మండలానికి చెందిన  శ్రీ రాజా రమేష్ శర్మ, ఒంటిమిట్ట మండలానికి చెందిన  చెందిన శ్రీ కె చంద్రశేఖర్  లకు.. దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా.. ప్రభుత్వం నుండి ఒక్కొక్కరికి రూ.10 ,116 లు  పారితోషికం, ప్రశంసా పత్రం, కండువాలను.. జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా అధికారులతో లతో కలసి అందజేశారు.అనంతరం ఉత్తమ అర్చకులు వేదపండితులకు,కవులకు  జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా  సత్కారం చేశారు.
అలరించిన సాంప్రదాయ, సాంస్కృతిక,కవి సమ్మేళన కార్యక్రమాలు

ఉగాది వేడుకల్లో   నృత్య తరంగిణి ప్రొద్దుటూరు బృందం చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు  ఆహుతులను అలరించాయి. అనంతరం వారిని జిల్లా జాయింట్ కలెక్టర్ సత్కరించారు.పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉగాది కోకిల అనే కవిత శీర్షిక పై గంగుల రామచంద్రరావు  కవి సమ్మేళనం చదివి  వినిపించారు.

దేవాదాయ ధర్మాదాయ శాఖ,పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి, సంప్రదాయ ప్రసాదాలను సభికులందరికి పంపిణీ చేశారు. 
ఈ కార్యక్రమంలో.. దేవాదాయ సహాయ కమిషనర్ సి  శంకర్ బాలాజీ,డ్వామా పిడి ఆదిశేషా రెడ్డి, పర్యాటకశాఖ  అధికారి సురేష్ ,అధికారులు,రమణమ్మ, జోయల్ విజయ్ కుమార్,శ్రీనివాసులు,శ్రీధర్, కలెక్టరేట్ ఏఓ విజయ్ కుమార్,సెక్షన్ సూపర్ ఇన్ టెన్ డెంట్లు,అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.