యానాం, మహి న్యూస్, మార్చి 16. యానాం లో హెచ్ పి గ్యాస్ కంపెనీ గ్యాస్ సిలండర్ల కొరతను అదునుగా చూసుకుని గ్యాస్ సిలండర్లును బుక్ చేసిన వారికి కాకుండా బ్లాక్ లో వేరొకరికి అధిక మొత్తానికి అమ్ముకుంటున్నారని సోమవారం స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యానాం పట్టణ పరిధిలో వంకాయల వారివీధిలో హెచ్ పి గ్యాస్ కంపెనీ ఉంది. అయితే ఈ కంపెనీ ద్వారా పట్టణ పరిధిలో వినియోగదారులు గ్యాస్ ను బుక్ చేసుకుంటున్నారు. అయితే గ్యాస్ బుక్ చేసుకున్నవారికి కంపెనీనుంచి
 ఒటిపిలు వస్తుండటంతో పాటు దానికి సంబంధించి అమౌంట్ కూడా చెల్లిస్తున్నట్లు మొబైల్ ఫోన్ కు మెసేజ్ లు వస్తున్నాయి. అయితే 
ఈ గ్యాస్ సిలండర్లు గ్యాస్ బుక్ చేసుకున్నవారికి కాకుండా వేరొకరికి బ్లాక్ మార్కెట్లో అధికమొత్తానికి అమ్ముతున్నట్లు తెలిసింది. దీంతో విషయం తెలుసుకున్న కొంతమంది గ్యాస్ వినియోగదారులు సోమవారం వంకాయల వారి వీధిలోగల గ్యాస్  కంపెనీ ముట్టడించి యాజమన్యాన్ని నిలదీశారు. తాము గ్యాస్ బుక్ చేస్తుంటే ఒటిపి చెప్పమంటున్నారని అనంతరం గ్యాస్ సిలండర్ డబ్బులు కూడా చెల్లించినట్లు మెసేజ్ లు ఎందుకు వస్తున్నాయని వారు ప్రశ్నించారు. దీంతో కంపెనీ సిబ్బందికి వినియోగదారులకు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో డీలర్ కు   హెచ్ పి గ్యాస్ కంపెనీ మోసాన్ని స్థానిక ఆర్ఎఒ, ఎల్జీ కి దృష్టికి తీసుకువెళతామని, సుంకరస్వామినాయుడు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సుంకర కార్తీక్ హెచ్చరించారు...