అమరావతి మహి న్యూస్ మార్చి 17
అంతర్జాతీయంగా LPG గ్యాస్ సరఫరా సమస్యలు నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

🔹 ఇప్పటికే 11,400 ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ
🔹 త్వరలో మరో 44,346 స్టవ్‌లు పంపిణీ
🔹 రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలకు అందుబాటులోకి

ఈ కార్యక్రమాన్ని Energy Efficiency Services Limited (EESL) సహకారంతో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తోంది.

👶 అంగన్వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందించే పౌష్టికాహారం తయారీలో ఎలాంటి అంతరాయం రాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.