ఒంటిమిట్ట / తిరుపతి, మహి న్యూస్ మార్చి 16
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణి చేస్తామని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఒంటిమిట్టలోని పరిపాలనా భవనంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
మీడియాతో మాట్లాడిన ముఖ్యాంశాలు
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒంటిమిట్టలో శ్రీకోదండ రామస్వామిబ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ నుండి ఏప్రిల్ 5 తేదీ వరకు 9 రోజులు పాటు వైభవంగా నిర్వహిస్తామన్నారు.
- రాష్ట్ర విభజన అనంతరం శ్రీరామనవమి ఉత్సవాలు ఒంటిమిట్టలో రాష్ట్ర పండుగ నిర్వహిస్తున్నాం
- టిటిడి ఆధ్వర్యంలో 2016 నుంచి శ్రీరామ నవమి ఉత్సవాలు శ్రీ రాముల వారి కళ్యాణం నిర్వహిస్తున్నాం.
- 14వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం ప్రారంభమై 17వ శతాబ్దంలో ముగిసిందని శాసనాలు చెబుతున్నాయి
- క్రీ. శ 1356లో బుక్కరాయలు ఈ ఆలయాన్ని నిర్మాణం ప్రారంభించారు
- విజయనగర రాజులు అంతరాలయము ,రంగ మండపం ,మహా ప్రాంగణం గోపురం నిర్మించారు
ఏప్రిల్ 1 తేదీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు
- రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు
- శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసేభక్తులకు ఉచితంగా రూ. 50 విలువగల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అందిస్తాం.
- భక్తులకు అన్నప్రసాదాలు త్రాగు నీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణి చేస్తాం.
- జిల్లా అధికారులు, టిటిడి సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేస్తున్నాం.
- శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షించడానికి ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తాం.
- రూ. 4 కోట్ల రూపాయలతో విద్యుత్ దీపాలంకరణ ఎల్ఈడి , పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు
- రూ. 20. 17 కోట్లతో 108 అడుగుల జాంబవంతుడు విగ్రహం నిర్మించేలా చర్యలు చేపడుతున్నాం
- మాస్టర్ ప్లాన్ లో భాగంలో 37 కోట్లతో 100 గదులు నిర్మిస్తున్నాం
- ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈరోజు నుంచి ఒంటిమిట్టలో భక్తులకు మూడు పూటలా అన్నప్రసాదాలు అందిస్తున్నాం.
అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ప్రారంభించిన టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయానికి ఎదురుగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు ప్రారంభించారు. గత ఏడాది శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా ఒంటిమిట్టకు విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలను నిరంతరంగా అందించాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనల మేరకు అన్నప్రసాద కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. భక్తులకు అన్నప్రసాదాలను అందించేందుకు జర్మన్ షెడ్ ను ఏర్పాటు చేశారు. అందులో భక్తులు కూర్చుని అన్నప్రసాదాలు స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారిని దర్శించుకున్న టిటిడి ఛైర్మెన్
అంతకుముందు శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో స్వామివారిని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు రాగానే ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం టిటిడి ఛైర్మెన్ కు తీర్థప్రసాదాలను అందించారు.
కల్యాణ వేదికను పరిశీలించిన టిటిడి ఛైర్మెన్
ఏఫ్రిల్ 1న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి చేస్తున్న ఏర్పాట్లను టిటిడి ఛైర్మెన్ పరిశీలించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. కల్యాణ వేదిక ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భద్రతా, అన్నప్రసాదాల పంపిణీ, కల్యాణాన్ని భక్తులు ఆనందంగా వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.చెరుకూరి శ్రీధర్, అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఎస్పీ శ్రీ షెల్కె నచికేత్ విశ్వనాథ్, జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం, సివీఎస్వో శ్రీ కే వి మురళీకృష్ణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.



good programs TTD om namo venkateshaya namah