సత్తెనపల్లి లో ఇప్పుడు పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయంలో ఇంటర్మీడియట్ తరగతి (సైన్స్) ప్రారంభం
సత్తెనపల్లి మహి న్యూస్ మార్చి 17
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాల్ జగదీశ్ కుమార్ గుప్తా ఎంపీ, ఎమ్మెల్యే లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయ సత్తెనపల్లి విద్యా రంగంలో నిరంతరం అభివృద్ధి సాధిస్తూ ఒక కొత్త గుర్తింపును ఏర్పరుచుకుంటోంది.
ఇటీవల పాఠశాలలో ఒక ముఖ్యమైన సాధనగా, స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణ దేవరాయలు (ఎంపీ) మరియు స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ అహర్నిశ కృషి, సహకారంతో ఇప్పుడు పాఠశాలలో ఇంటర్మీడియట్ (11వ) తరగతి (సైన్స్) ప్రారంభం చేయబడుతోంది. ఈ సందర్బంగా ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతో ముఖ్యమైన మరియు అభినందనీయమైన విషయం. దీని ద్వారా విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ ప్రాంతంలోనే మెరుగైన విద్యా అవకాశాలను పొందగలుగుతారు.
అలాగే, 3వ, 4వ మరియు 5వ తరగతుల్లో డబుల్ సెక్షన్లు ప్రారంభించబడ్డాయి. ఈ చర్యతో మరింత మంది విద్యార్థులకు నాణ్యమైన మరియు సులభమైన విద్య అందుబాటులోకి వస్తుంది.
ఈ విజయానికి గాను ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు కు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగదీష్ గుప్తా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
పాఠశాల యొక్క ఈ నిరంతర అభివృద్ధి, కేంద్రియ విద్యాలయ సత్తెనపల్లి రోజురోజుకు కొత్త విజయ శిఖరాలను అధిరోహిస్తున్నదని స్పష్టం చేస్తోంది. విద్య, శిస్తు మరియు సమగ్ర అభివృద్ధి రంగాల్లో ఈ పాఠశాల ఎప్పటికప్పుడు ప్రతిభను చాటుకుంటూ భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తమవుతోంది అని అన్నారు






Be the first to comment.