రాజోలు, మహిన్యూస్, మార్చి 18:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ బుధవారం విశ్వేశ్వరాయపురం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత బస్సు సౌకర్యం వలన దివ్యాంగులకు లబ్ది చేకూరుతుందని అన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం నేడు దివ్యాంగ శక్తి పధకం ద్వారా దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించడం శుభపరిణామం అని అన్నారు. రాజోలు నియో
జకవర్గంలో ఉన్న 4వేల మంది దివ్యాంగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా జన చైతన్య దివ్యాంగుల జేఏసీ, కూటమి ప్రభుత్వానికి, శాసనసభ్యులు దేవ వరప్రసాద్ కు ధన్యవాదాలు తెలియచేశారు.అనంతరం ఎమ్మెల్యే పచ్చ జెండా ఊపి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించి కొద్ది దూరం బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ స్పెషల్ ఆఫీసర్ జి.మమ్మీ మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి
.సత్యవతి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తుందని దానిలో భాగంగా వివాంగులకు నాలుగువేల రూపాయలు పెన్షన్, 6000 రూపాయలు చేయటం జరిగిందని తెలిపారు.అలాగే మంచానికి పరిమితైన వారికి 15 వేల రూపాయలకు పెంచడం జరిగిందని అని తెలియజేశారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన  ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకు,ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్, జనసేన నాయకులు పెద్దకాపు, గుబ్బల పనేంద్ర, రాజోలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ కేత వెంకటలక్ష్మి శ్రీనివాస్, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ బందెల పద్మ,, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మంగెన భూదేవి, విశ్వేశ్వరాయపురం సర్పంచ్ చెల్లుబోయిన హెలీనా, మట్టపర్రు సర్పంచ్ కడలి దుర్గ భవాని,టీడీపీ నాయకులు చాగంటి స్వామి, ముప్పర్తి నాని, ఆనంద కుమార్, కౌరి శ్రీను , కడలి వెంకటరత్నం, యనమల శ్రీధర్. నీటి సంఘం అధ్యక్షులు ఎనిమివేల సిం
హాచలం తదితరులు పాల్గొన్నారు.