ఆదిలాబాద్, మహి న్యూస్
మార్చి 19
నిబద్ధతకు గుర్తింపుగా కాంగ్రెస్ పార్టీ మరోసారి యువ నాయకుడు పసుల చంటి పై విశ్వాసం ఉంచింది. ఆయనను జిల్లా అధికార ప్రతినిధిగా పునర్నియమిస్తూ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల పరిధిలోని ధన్నూర్-బి గ్రామానికి చెందిన పసుల చంటి, కట్టర్ కాంగ్రెస్ వాది మరియు రాజకీయ విశ్లేషకుడిగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భౌగోళిక, సామాజిక, రాజకీయ పరిస్థితులతో పాటు వ్యవసాయం, సాగునీరు, తాగునీటి సమస్యలపై మంచి అవగాహన కలిగిన నాయకుడిగా ఆయనకు పేరు ఉంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (ఎంఎల్సీ) ఆయనను జిల్లా అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2018 సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పసుల చంటి చురుకుగా పనిచేస్తున్నారు. ఏఐసీసీ, పీసీసీ, డీసీసీ పిలుపులకు అనుగుణంగా మాత్రమే కాకుండా, స్థానిక సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలు చేపట్టి విజయాలు సాధించారు.
ఈ సందర్భంగా పసుల చంటి మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి మరోసారి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఇన్నేళ్లుగా తనకు మద్దతుగా నిలిచిన సహచర కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాబూరావు, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.





Be the first to comment.