జిప్మర్ ఆసుపత్రిలో స్వస్థ నారి ససక్తి పరివార్ అభియాన్

Sep 24, 2025 - 09:56
Sep 24, 2025 - 09:56
 0  33
జిప్మర్ ఆసుపత్రిలో స్వస్థ నారి ససక్తి పరివార్ అభియాన్

 పాండిచ్చేరి, యానం, మహి న్యూస్, ( సెప్టెంబర్ 23) :

కేంద్రపాలిత ప్రాంతమైన యానం జిప్మర్ ఆసుపత్రిలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వస్థనారి ససక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆఫీసర్ ఇన్చార్జ్ డాక్టర్ ఆనంద్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సుమారు 15 మంది డాక్టర్లు పర్యవేక్షణలో యానంలో ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగాలు నిర్వహిస్తున్న మహిళలకు. వాతావరణ మార్పుల వలన, కాలుష్యాల వలన, మహిళలు రోగాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై డాక్టర్లు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ప్రాంతీయ పరిపాలన అధికారి అంకిత్ కుమార్ ఐఏఎస్ స్వయంగా వచ్చి పరిశీలించి డాక్టర్లు, మరియు మహిళలతో పలు విషయాలపై మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జిప్మర్ ఆసుపత్రి  డాక్టర్లు, కే గాయత్రి, నవేషా దుర్గ, సాయి తేజస్విని, నిలోఫర్ బేగం, బిందు ప్రియాంక, సుభ శ్రీ, దేవి మాధురి, బి.సుకీర్తి, మరియు భద్రతా అధికారులు ఎన్.వెంకటరమణ, కే రవిబాబు, తదితర సిబ్బంది పాల్గొన్నారు..

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0