యువతకు ఆదర్శనీయం.. అల్లూరి సీతారామరాజు- ఇచ్చార్జీ డీఆర్వో వెంకటపతి (video)
యువతకు ఆదర్శనీయం.. అల్లూరి సీతారామరాజు- ఇచ్చార్జీ డీఆర్వో వెంకటపతి
వైయస్సార్ కడప జిల్లా, మహి న్యూస్ జులై 04: స్వాతంత్య్ర సమరయోధులు, మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు ఈ తరం యువతకు ఆదర్శనీయమని..ఇచ్చార్జీ డీఆర్వో వెంకటపతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ హాలులో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శ్రీ అల్లూరి సీతారామరాజు 128వ జయంతి కార్యక్రమానికి ఇచ్చార్జీ డీఆర్వో వెంకటపతి ముఖ్య అతిధిగా హాజరై అధికారులతో కలిసి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతిప్రజ్వల గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇచ్చార్జీ డీఆర్వో వెంకటపతి మాట్లాడుతూ... నేటి సమాజానికి.. అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలు ఆదర్శణీయం అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను మరువరాదని, ఆయన ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని.. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, అందుకోసం తన ప్రాణాలర్పించిన యోధుడన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చాటుకున్న విప్లవ వీరుడన్నారు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే చాలా వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొట్టి వీర మరణం పొందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ డిడి సరస్వతి, బీసీ సంక్షేమ శాఖ డిడి అంజన,జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి పద్మజ, కలెక్టరేట్ ఏవో విజయ్ కుమార్,టూరిజం మేనేజర్ రామ్ కుమార్,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0