మెగాస్టార్ ఐటం సాంగ్ లో కాక పుట్టించే క‌న్న‌డ‌ బ్యూటీ?

Jun 19, 2025 - 17:29
 0  47
మెగాస్టార్ ఐటం సాంగ్ లో కాక పుట్టించే క‌న్న‌డ‌ బ్యూటీ?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 156వ చిత్రం 'విశ్వంభ‌ర' చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సినిమాలో అదిరి పోయే ఐటం సాంగ్ కూడా ఉంటుంద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ పాట కోసం ఐటం స్పెష‌లిస్ట్ భీమ్స్ నే రంగంలోకి దించుతున్నారు. సినిమా మొత్తానికి సంగీతం అందించిన కీర‌వాణిని ప‌క్క‌న‌బెట్టి మ‌రీ భీమ్స్ ని ఎంపిక చేసారు. మాస్ ఐటం పాట‌ల‌తో యువ‌త‌లో క్రేజీగా మార‌డంతో చిరంజీవి రిక్వెస్ట్ మేర‌కు భీమ్స్ సీన‌లోకి వ‌చ్చాడు. అంటే ఐటం పాట‌ను ఏ రేంజ్ లో ప్లాప్ చేస్తున్నారో? ఈ ఒక్క సంద‌ర్భ‌మే చెబుతుంది. మ‌రి చిరుకు జోడీగా ఆడిపాడే ఐటం బ్యూటీ ఎవ‌రు? అంటే క‌న్న‌డ సంచ‌ల‌నం నిశ్వికా నాయుడు పేరు తెర‌పైకి వ‌చ్చింది. నిశ్వి కా ఎంట్రీ గ‌నుక ఖ‌రారైతే ఐటం సాంగ్ పీక్స్ లోనే ఉంటుంది. నిశ్వికా ఐటం పాట‌ల‌కు స‌ర్పెక్ట్ ఛాయిస్. ఆ మ‌ధ్య ప్ర‌భుదేవాతో క‌లిసి 'హిత‌ల‌కా క‌రిబ‌య‌డా మావ‌' అంటూ సోష‌ల్ మీడియాను ఏ రేంజ్ లో ఊపిందో చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డి అందం..అభిన‌యం పాట‌ను పీక్స్ చేర్చాయి. ప్ర‌భుదేవాతో పోటీ ప‌డి మ‌రీ డాన్సు చేసింది. ఇండియ‌న్ మైఖెల్ జాక్సన్ కే డాన్సులో చెమ‌ట‌లు ప‌ట్టించినంత ప‌ని చేసిం ది. అలాంటి క్రేజీ బ్యూటీని చిరంజీవికి జోడీగా ఐటం పాట‌కు ప‌రిశీలించ‌డం అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0