కూటమి ప్రభుత్వంలోనే బలిజలకు న్యాయం - నామినేటెడ్ పదవులు పొందిన వారికి రోపా ఘన సన్మానం

Jul 21, 2025 - 18:17
 0  31
కూటమి ప్రభుత్వంలోనే బలిజలకు న్యాయం - నామినేటెడ్ పదవులు పొందిన వారికి  రోపా ఘన సన్మానం

*కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం*

*నామినేటెడ్ పదవులు పొందిన వారికి రోపా ఘనంగా సన్మానం*      

*జనాభా దామాషా ప్రకారం బలిజలకు రాజకీయ అవకాశం ఇవ్వాలి* 

కర్నూలు, జూలై 21:బలిజలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి కర్నూలు బలిజ సంఘం తరఫున నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులు పొందిన మైలేరి సురేఖ, యుద్ధం వెంకట రమణలకు ఘన సన్మానం చేశారు.

కర్నూలు నగరంలోని డివిఆర్ హోటల్‌లో రాయల్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (రోపా) ఆధ్వర్యంలో బలిజల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమావేశంలో ఆళ్లగడ్డ మార్కెట్ యార్డు నూతన చైర్మన్ మైలేరి మల్లయ్య సతీమణి మైలేరి సురేఖ, ఉలిందకొండ సింగిల్ విండో చైర్మన్ యుద్ధం వెంకట రమణను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి చంద్రబాబు, అహోబిల బలిజ నిత్య అన్నదాన సత్రం అధ్యక్షులు శెట్టి విజయ్ కుమార్, రోపా అధ్యక్షులు చింతలపల్లి రామకృష్ణ, జనరల్ సెక్రటరీ కోనేటి వెంకటేశ్వర్లు ...మాట్లాడుతూ — “కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో బలిజలు కీలక పాత్ర పోషించారు. జనాభా ప్రకారం నామినేటెడ్ పదవుల్లో మరింత ప్రాధాన్యం కల్పించాలి” అని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో సహకరించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

"మా జనాభా అధికంగా ఉన్న మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి" అని రోపా నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకత్వం నుంచి చింతా సురేష్, జవ్వాజి రేఖ, పసుపల పవన్ కుమార్, కొణిదెల శ్రీనివాస్, పూజల రాము, కొండా విజయ్, జిల్లా బలిజ సంఘం నేతలు అంచ పెద్ద స్వామి, కొట్టే చెన్నయ్య, బిఎ శ్రీనివాసరావు, దంతెల రమణ, యుద్ధం శ్రీకాంత్, తుళువ గోపాల్, రామనాథ్, బాలరాజు, సుబ్రమణ్యం, బత్తుల గంగాధర్, గన్నపురెడ్డి శ్రీనివాస్, మధుసూదన్ రావు, మణికంఠ హోమ్స్ లక్ష్మీ నారాయణ, బీఎస్‌ఎన్‌ఎల్ ఆంజనేయులు, బుర్రా చంద్రమోహన్, లక్ష్మీ నారాయణ, సహాదేవుడు, మురళీ మోహన్, శైలేష్, అమర్, శేషు, సంజీవ్ తదితరులు

పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0