కింది స్థాయి ఉద్యోగస్తులను వేధిస్తున్న ఉన్నతాధికారులపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలి
ఎం ఎల్ హెచ్ పి / సి హెచ్ ఓ, ఏఎన్ఎం, ఆశా వర్కర్ లను లైంగికంగా, మానసికంగా వేధిస్తూ, కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతూ,క్షోభకు గురిచేస్తూ, తక్కువ కులం వారిని, కులం పేరుతో అగౌరవంగా మాట్లాడుతూ, భయబ్రాంతులకు గురిచేస్తూ, అవినీతి,అక్రమాలకు పాల్పడుతున్న డి డి ఓ ల పై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ..
వైయస్సార్ కడప జిల్లా, కడప నగరంలోని పాత రిమ్స్ నందు ఉన్న ప్రాంతీయ వైద్య మరియు ఆరోగ్య సంచాలకుల వారి కార్యాలయంలోని ఆర్.డి.ఎం సూపర్డెంట్ శ్రీనివాసులు కి విద్యార్థి సంఘ నాయకులు సోమవారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాల జయవర్ధన్, ప్రగతిశీల రెవల్యూషనరీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్ మాట్లాడుతూ...
నంద్యాల జిల్లా,అవుకు మండల పరిధిలోని ఆకుమళ్ల పి హెచ్ సి లో మెడికల్ ఆఫీసర్లు లు తమ పరిధి లోని ఎం ఎల్ హెచ్ పి / సి హెచ్ ఓ, ఏఎన్ఎం, ఆశా వర్కర్ లను సిబ్బంది లను మానసికంగా కక్ష సాధింపు ధోరణితో వేధిస్తూ,తమకు అనుకూలంగా వున్న రిపోర్టర్లను విలేజ్ క్లీనిక్‌లతో పంపి మా మాట వినకపోతే మీ మీద పత్రికలలో వార్తలు, స్టోరీలు వ్రాయిస్తామని బెదిరిపులకు, వేధింపులకు పాల్పడుతూ, వారి మాటలు వినని పై అధికారులకు ఫిర్యాదులు చేస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అలాగే ఉద్దేశ్యపూర్వకంగానే తమకు అనుకూలంగా వున్న వారి చేత ఎం ఎల్ హెచ్ పి / సి హెచ్ ఓ, ఏఎన్ఎం, ఆశా వర్కర్ లు లేని సమయంలో (భోజన విరామం లేదా గంట రెండు గంటలు బయటికి వెళ్ళిన సమయంలో) ఫోటోలు, వీడియోలు తీయించడం, వాటిని అడ్డం పెట్టుకొని మహిళలని బ్లాక్ చెయ్యడమే వారి దినచర్యగా పెట్టుకున్నారు. ముఖ్యంగా వీరు మహిళ ఎం ఎల్ హెచ్ పి / సి హెచ్ ఓ, ఏఎన్ఎం, ఆశా వర్కర్ లను సిబ్బంది లపై వేధింపులు అనగా లైంగికంగా, మానసికంగా) అధికంగా వున్నాయన్నారు. గతంలో కూడా స్టాఫ్ నర్సును లైంగికంగా వేధించడం జరిగిందన్నారు.ఈమె హ్యూమన్ రైట్స్ కమీషన్‌కు ఫిర్యాదు చేయడం జరిగిందని కాని తరువాత ఆమెను భయబ్రాంతులకు గురి చేసి కమీషన్ ముందుకు రాకుండా అడ్డుకోవడం జరిగిందన్నారు. అయినా కూడా ఈ ఇరువురిలో ఎలాంటి మార్పు లేదు. తమ మాట వినని వారిని లక్ష్యంగా చేసుకొని, వారు లేని సమయంలో వెళ్ళి బెదిరింపులకు దిగి, రికార్డ్సు సరిగా లేవని, నువ్వు విధులకు సరిగా రావడం లేదు, నీ మీద పై అధికారులకు రిపోర్టు చేస్తామని భయబ్రాంతులకు గురి చేసి లొంగదీసుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఆకుమళ్ల పి హెచ్ సి పరిధిలోని గ్రామాలకు 104 వాహనాలతో సంచార వైద్య సేవలు అందించడానికి వీరు వెళ్ళవలసివున్నా, ఎం ఎల్ హెచ్ పి / సి హెచ్ ఓ, ఏఎన్ఎం, ఆశా వర్కర్ వీరు వెళ్ళకుండా నిర్లక్ష్యంగా నిర్వహిస్తూ విధులు సరిగ్గా నిర్వహించడం లేదు. 104 వాహనంలో సిబ్బందిని పంపి వీరు వెళ్ళకుండా, వారి వ్యక్తిగత కార్యకలాపాలు చూసుకుంటున్నారన్నారు అదే విధంగా లు సిబ్బంది దగ్గర నుంచి విలేకర్లకు, పై అధికారులకు కమీషన్లు ఇవ్వవలసివుందని పలుమార్లు వారికి అవసరము వున్నప్పుడల్లా ఒక్కొక్కరి దగ్గర నుండి వేల రూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నారు. అలాగే వీరి పీహెచ్సీ.కి కేటాయించిన మందులను బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని లక్షల రూపాయలను అక్రమంగా సంపాదిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. వీటిని ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తూ ఉద్దేశ్యపూర్వకంగా వేధిస్తున్నారు.
ఏ రాజకీయ పార్టీ అధికారంలో వున్నా మా బంధువులు, మా కులపు వారు (రెడ్డి) వున్నారని మా మాటకు ఎదురు లేదని, మా మాటే వింటారని, మేము చెప్పిందే జరుగుతుందని పై అధికారులు కూడా ఎం ఎల్ హెచ్ పి, సిహెచ్ఓ, ఏఎన్ఎం, ఆశా వర్కర్ లపై కక్షసాధింపు, వేధింపులకు (లైంగికంగా, శారీరకంగా, మానసికంగా) పాల్పడుతున్నారు.
వీరి వేధింపులు (లైంగికంగా, శారీరకంగా, మానసికంగా) కక్ష్యసాధింపు చర్యలపై, అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేయించి తమరు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్బి జిల్లా కన్వీనర్ సగిలి రాజేంద్రప్రసాద్, పిఆర్ఎస్ వై ఎఫ్ జిల్లా కన్వీనర్ ఓరుగంటి నాగేంద్రబాబు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0