ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్.. టీమిండియాకు బిగ్ షాక్

Jun 19, 2025 - 17:39
 0  0
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్.. టీమిండియాకు బిగ్ షాక్

భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ శుక్రవారం (జూన్ 20) నుంచి ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ లో గెలిచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో మంచి ఆరంభం ఇవ్వాలని భారత జట్టు భావిస్తోంది. గతసారి టీమిండియా ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. దీనికి తోడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు రిటైర్ అయ్యారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌లోని కఠినమైన పిచ్‌లపై టీమిండియా యువ ఆటగాళ్లు ఎలా రాణిస్తారో చూడాి. కాగా ఈ సిరీస్ కోసం 8 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జట్టులోకి వచ్చాడు కరుణ్ నాయర్. ప్రస్తుతం అతని ఫామ్‌ను చూస్తే, ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉంటాడని తెలుస్తుంది. కానీ ఈలోగా, కరుణ్ నాయర్ గురించి వినకూడని ఒక వార్త బయటకు వచ్చింది. అదేంటంటే..శుక్రవారం నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టు బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ కు గాయమైనట్లు సమాచారం. బుధవారం, నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, అతనికి బంతి బలంగా తగిలింది. దీని వల్ల అతను గాయపడ్డాడని తెలుస్తోంది. నివేదికల ప్రకారం, ఫాస్ట్ బౌలర్ ప్రసీద్ కృష్ణ వేసిన బంతి నాయర్ నేరుగా కడుపుకు తగలడంతో పక్కటెముకకు గాయమైనట్లు తెలుస్తోంది. గాయం తర్వాత తిరిగి బ్యాటింగ్ ప్రారంభించేలోపే కరుణ్ నాయర్ ఇబ్బంది పడ్డాడు. 2017 తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్‌కు ఇది ఒక పెద్ద అవకాశం. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన అతను ఇప్పుడు ఇంగ్లాండ్ టెస్ట్‌ల కోసం జట్టులోకి వచ్చాడు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0