. చిత్తూరు జిల్లా /బంగారుపాలెం ఏప్రిల్ 30.   చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా మండల మెకానిక్స్ వారి ఆధ్వర్యంలో మే డే సందర్భంగా జెండా ఆవిష్కరణ రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు పురుషోత్తమ నాయుడు మాట్లాడుతూ, మండలంలో ఇంతవరకు ఆఫీస్ లేకపోవడంతో, మెకానిక్స్ కి మండల పరిధిలో స్థలం కేటాయించాలని దాయీనేని ధర్మారావు కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇదివరకే ఇంటి స్థలాలు కేటాయించాలని, మెకానికల్ కు 55 సంవత్సరాలకే పెన్షన్ మంజూరు చేయాలని ఇంకను ఎనిమిది డిమాండ్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందించినట్లు తెలిపారు. మెకానిక్ కి మండల పరిధిలో ఇంటి స్థలాలు కేటాయించాలని మండల అధికారులను కోరారు. దీనిపై రాష్ట్ర అధ్యక్షులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మెకానిక్స్ యూనియన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చిట్టిబాబు, కార్యదర్శి రాజా, ఉప కార్యదర్శి విజయ్ కుమార్, కోశాధికారి  కుమార్ రాజా, కార్యనిర్వాహక సభ్యులు మురళి, షౌకత్, షేక్ రసూల్, ఉమేష్, మహబూబ్ బాషా, బాబా, శివకుమార్, హరీష్, సుహేల్, తదితరులు పాల్గొన్నారు