బరువు తగ్గించే ఔషధాలపై కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది. ఈ ఔషధాల వినియోగ ప్రచారంపై నిషేధం విధించింది. ఇటీవల GLP-1 ఆధారిత బరువు తగ్గించే జెనరిక్ రకాల ఔషధాలు దేశంలోకి ప్రవేశించాయి. దీంతో రిటైల్ ఫార్మసీలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, టోకు వ్యాపారులు, వెల్‌నెస్‌ క్లినిక్‌ల ద్వారా సులభంగా లభించడంపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అనధికారిక అమ్మకాలపై డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణ చేపట్టనుంది.