ప్రకృతి సందేశ కవిత
నిశీధిలోనూ వినిపించే నిశ్శబ్ద గానం—
అది జలధారల మృదుస్పర్శ;
చుక్కగా పడి నేలను తాకే వేళ,
భూమి హృదయం హర్షంతో కొట్టుకుంటుంది।
అదృశ్యంగా సాగిపోతున్న ప్రతి చుక్కలో,
అనంతకాలపు ఆశలు దాగి ఉంటాయి;
దాన్ని అర్థం చేసుకున్న మనసే మహోన్నతం,
దాన్ని వృధా చేసిన వేళ కాలమే ప్రశ్నిస్తుంది।
వెలుగు చూడని విత్తనాలకైనా జీవం ఇచ్చేది,
నిశ్శబ్దంగా జారే నీటి కరుణ;
ఆ కరుణను కాపాడే చేతులే,
భవిష్యత్తు వేదికను నిర్మించే శిల్పులు।
ఎండిన నేలపై పగుళ్లు పడిన వేళ,
ఆర్తనాదం వినిపించేది ప్రకృతిదే;
ఆ స్వరం అర్థం చేసుకున్న మనిషి,
జలాన్ని దేవతగా భావించి కాపాడతాడు।
ఇంటి తలుపు దగ్గర జారే ఒక చుక్కనుంచి,
ప్రపంచపు ప్రవాహాల వరకూ—
సంరక్షణ అనే ఒక చిన్న నిర్ణయం,
విశాలమైన మార్పుకు మార్గదర్శకం అవుతుంది।
జలమే కాదు—మనసాక్షి కూడా అదే,
దాన్ని కాపాడటం అంటే మనల్ని మనం కాపాడటం;
చుక్కను దాచిన వేళ చరిత్ర నిలుస్తుంది।
🌍 సందేశం:
ప్రకృతికి మనం ఇచ్చే అతి పెద్ద కానుక – నీటి సంరక్షణ
ప్రతి ఒక్కరూ నీటిని ఆదా చేద్దాం 💧
✍️ రచన: మంజుల పత్తిపాటి
📞 చరవాణి: 9347042218
📍 యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ





Be the first to comment.