అమరావతి  మహి  న్యూస్ డెస్క్ : గ్యాస్ కొరత కారణంగా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లను ప్రభుత్వం అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 55,746 కేంద్రాలుం డగా ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద 11,400 కేంద్రా లకు స్టవ్లను అందించారు. వాటి నిర్వహణ, సమయం తదితరాలపై అంగన్వాడీ కార్యకర్తల నుంచి ప్రభుత్వానికి సానుకూల అభిప్రాయం అందింది. ఈ నేపథ్యంలో మిగతా 44,346 కేంద్రాలకు వీటిని అందించాలని నిర్ణయించింది. ఇండక్షన్ స్టవ్లు, పాత్రలు ఇవ్వనున్నారు. ఇందుకు రూ.62కోట్లు ఖర్చ వుతుంది. ఒక్కో కేంద్రానికి ఇండక్షన్ స్టవ్, వంటపా త్రలు కలిపి రూ.7వేల విలువైనవి అందించనున్నారు. మే నెలాఖరుకు నాలుగు విడతల్లో అన్ని కేంద్రాలకూ ఇవి అందేలా అధికారులు చర్యలు చేపట్టారు.