చిత్తూరు జిల్లా/ బంగారుపాలెం ఏప్రిల్ 6.

 చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం లో 01 -12 -2024  వ తేదీ రాత్రి బంగారుపాళ్యం మండలం రాగిమాను పెంట రోడ్డు, గ్యాస్ గోడౌన్ వద్ద పార్క్ చేసి పెట్టిన పల్సర్ మోటార్ సైకిల్ బీరింగ్ రిజిస్ట్రేషన్ నెంబర్. TN18 Z 6482 ను గుర్తు తెలియని వ్యక్తి దొంగతనము చేయడం జరిగినది.పై కేసులో దర్యాప్తు లో భాగంగా తోటి రాజేష్ , వయస్సు  27 సంవత్సరములు తండ్రి, టీ. చిన్నరెడ్డప్ప ,  కులం ఎస్సీ మాల: వృత్తి కూలీ మొగిలి వెంకటగిరి గ్రామం పాలేరు పంచాయతీ మోతగుంట గ్రామం  బంగారుపాళ్యం మండలం  అను వ్యక్తిని 05 -12 -2024  వ తేదీన బంగారుపాళ్యం పోలీసుస్టేషన్ సీఐ కత్తి శ్రీనివాసులు  అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి దొంగిలించిన పల్సర్  మోటార్ సైకిల్ ను రికవరీ చేయడమైనది. అనంతరం ముద్దాయిని కోర్టులో హాజరు పరచగా జైలుకు పంపడమైనది.పై కేసుల విచారణలో భాగంగా ఈ దినం చిత్తూరు కోర్టు జడ్జి గారు డి ఉమాదేవి సదరు ముద్దాయి కి పై కేసులో ఒక సంవత్సరం రోజులు జైలు శిక్ష విధించడం అయినది. ఈ కేసును ప్రభుత్వం తరఫున వాదించిన ఏపీపీ కే.ఉమాదేవి ఈ కేసును సాక్షులను సకాలంలో హాజరు పరిచిన కోర్ట్ హెడ్ కానిస్టేబుల్ సామ్రాజ్ ని  బంగారుపాళ్యం ఇన్స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు అభినందించడమైనది.