శ్రీకాకుళం, మహి న్యూస్, మార్చి 31 : "నేత్రదానం" శ్రేష్ఠ దానమని, రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు అన్నారు. స్థానిక కాకి వీధికి చెందిన గంధం.సరోజని 80 సంవత్సరాలు, తనువుచాలించారు. ఈ సందర్భంగా  రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ నేత్ర దానం అనేది ఒక నష్టాన్ని అమూల్యమైన కానుకగా మార్చి, ఒక వ్యక్తి ప్రపంచాన్ని మళ్ళీ చూసేలా చేసే ఒక సురక్షితమైన, ప్రభావవంతమైన మార్గమని, నేత్రదానం మహాదానమన్నారు. గంధం.సరోజని కుటుంబ సభ్యులు నేత్ర దానం చేయాలనుకోవటం ఆనందదాయకమని, కొడుకు గంధం.సాగర్ కుమార్, గోవింద రాజులు, పి.కుమార్ లకు, రెడ్ క్రాస్ ప్రతినిధి నేత్రదాన ప్రేరేపకులు కొల్లు.సత్యనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. నేత్ర సేకరణలో భాగముగా మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి.సుజాత, సహాయకులు నంది . ఉమాశంకర్ ద్వారా ఆమె కార్నియాలు సేకరించి, విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారన్నారు. సహకరించిన కుటుంబ సబ్యులకు పేరు పేరునా కృతజ్ఞతలని, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్, ఇతర సభ్యులు అభినందించారు. నేత్రదానం పై అవగాహన, చైతన్యం ప్రజల్లో పెరుగుతుందని, రానున్న రోజులలో అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తామని, ఈ విధంగా నేత్రదానం ద్వారా మరొకరికి ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం కలుగుతుందని, అంధత్వ రహిత సమాజ స్థాపనకు యువత,ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేత్ర దానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరుకు సంప్రదించాలన్నారు.