చిత్తూరు జిల్లా/ బంగారుపాళ్యం ఏప్రిల్ 30: చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 01/03/24 నుండి 30/04/25 వరకు జరిగిన పనులకు సంబంధించి19వ విడత సామాజిక తనిఖీ కి గురువారం 30/04/26 ఎంపీడీవో కార్యాలయం నందు బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డ్వామా చిత్తూరు ప్రాజెక్టు డైరెక్టర్ ఏ రవి కుమార్,ప్రిసైడింగ్ అధికారిగా రావడం జరిగింది .
ఈ సామాజిక తనిఖీలో
ఉన్నటువంటి శాఖలు .
ఖర్చు వివరాలు
1 ఎంజిఎన్ఆర్ఇజిఎస్ (గ్రామీణ అభివృద్ధి శాఖ). -59515550.
2.పంచాయతీ రాజ్ -7962557.
3 ఎస్ ఎస్ ఏ -298990.
మొత్తం-67777097
ఈ సామాజిక తనిఖీ బహిరంగ సభ నందు ఉపాధి హామీ సిబ్బందికి కొన్ని హెచ్చరికలు చేస్తూ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. పనుల్లో అవకతవకలు జరిగితే ఎవర్ని ఉపేక్షించేది లేదని ప్రతి పనికి నేమ్ బోర్డ్స్ పెట్టాలని జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి పనులు కల్పించాలని తెలియజేస్తూ కొన్ని పంచాయతీలందు
రికవరీ -45475
పెనాల్టీస్ -31000 వ్రాయడo జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పిఓ/ ఎంపీడీవో / ఎస్.కె మహేష్,
ఏఈ పి ఆర్ కృష్ణయ్య
ఓంబుట్స్ పర్సన్ వరద రాజులు, ఎస్ఆర్పి మురద్,-
డిఆర్పీస్ ఈజీఎస్ స్టాఫ్ సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ , మరియు ఉపాధి వేతన దారులు, రైతులు హాజరు కావడం జరిగింది.








Be the first to comment.