పవనపుత్రుడి పవిత్ర నామం పలుకుదాం
పరమభక్తి పరాక్రమాన్ని స్మరించుదాం
రామదూతుడై రణరంగంలో రౌద్రమై
ధర్మరక్షణలో నిలిచిన వీరుడై!

అంజనేయుడి ఆత్మలో అచంచల భక్తి
అపారమైన శక్తిలో అమోఘమైన యుక్తి
గిరులను ఎత్తిన గర్వమేమీ లేని వినయం
సేవలో చూపిన నిజమైన మహిమ!

సంకటమొచ్చిన వేళ సాహసం నేర్పినవాడు
సందేహంలో ఉన్న మనసుకు ధైర్యం ఇచ్చినవాడు
రామనామమే ఆయుధమై నిలిచినవాడు
లోకాలందరికీ ఆదర్శంగా వెలిగినవాడు!

హనుమాన్ జయంతి ఈ శుభసందర్భంలో
మన హృదయాల్లో భక్తి దీపం వెలిగిద్దాం
ఆయన ఆశీస్సులతో ఆనందం నిండగా
సుఖశాంతులతో జీవితాన్ని సాగిద్దాం!

జై శ్రీ హనుమాన్! 🙏

రచన మంజుల పత్తిపాటి( కవయిత్రి)
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
 చరవాణి 9347042218