ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
శ్రీకాకుళం / నిమ్మాడ, మహి న్యూస్, మార్చి 31: ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం నిమ్మాడలోని తన క్యాంప్ కార్యాలయంలో 'ప్రజా దర్బార్' కార్యక్రమాన్ని నిర్వహించారు. నందిగాం, టెక్కలి మండలాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజల నుంచి వినతులు ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా దర్బార్‌కు వచ్చిన వినతుల్లో అత్యధికంగా భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పిదాల వల్ల, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేకమంది పేదల భూములు ఇతరుల పేర్లకు మార్పిడి అయ్యాయి. బాధితులకు న్యాయం జరిగేలా రెవెన్యూ అధికారులతో మాట్లాడి ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం జరిగేలా చేస్తామని తెలిపారు, మౌలిక సదుపాయాలకు పెద్దపీట గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా రహదారుల నిర్మాణం, గ్రామాల్లో సీసీ రోడ్లు లేని గ్రామం ఉండకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శాఖల సమన్వయం పంచాయతీరాజ్, రహదారులు, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. వేసవి నేసథ్యంలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత విద్య, వైద్యం మరియు ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శక పాలన అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. సమస్య ఏదైనా సరే, నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని ప్రజలకు భరోసా ఇచ్చారు.








Be the first to comment.