రాజోలు, మహి న్యూస్,మార్చి 19:అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఉగాది వేడుకలు మరియు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో రాజోలు శాసన సభ్యులు దేవ వరప్రసాద్ పాల్గొన్నారు.ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేసారు.అనంతరం అర్చక బృందాన్ని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవవరప్రసాద్ తో పాటు రాజోలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కేత వెంకటలక్ష్మి శ్రీనివాస్, విశ్వేశ్వరాయపురం సర్పంచ్ చెల్లుబోయిన హెలీనా, మట్టపర్రు సర్పంచ్ కడలి దుర్గ భవాని, టిడిపి నాయకులు చాగంటి స్వామి, ముప్పర్తి నాని, ఆనంద కుమార్, కౌరి శ్రీను , కడలి వెంకటరత్నం, యనమల శ్రీధర్. నీటి సంఘం అధ్యక్షులు ఎనిమివేల సింహాచలం ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.









Be the first to comment.