రాజంపేట. మహిన్యూస్. మార్చి:19
రాజంపేట మార్చి 18: రాజంపేట మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల గాలి వానలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా హస్తవరం, చెర్లోపల్లి, కొత్తపల్లి, ఆకేపాడు తదితర గ్రామాలలో వేల ఎకరాల్లో సాగు చేసిన అరటి పంటలు నేలకొరిగాయి. పంట కోత దశలో ఉండగా ఈ విపత్తు సంభవించడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. ఈ ఘటనతో తమ జీవితాలు సంక్షోభంలో పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరమంతా కష్టపడి పండించిన పంట ఒకే రాత్రిలో నాశనం కావడంతో వారు తీవ్ర నిరాశలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి, నష్టపోయిన పంటలపై తక్షణ సర్వే నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. అలాగే నష్టపరిహారం అందించి, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల సమస్యలను గుర్తించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని వారికి సహాయం చేయాలని స్థానిక ప్రజలు, రైతు సంఘాలు కూడా కోరుతున్నాయి








Be the first to comment.