సఖినేటిపల్లి, మహిన్యూస్, మార్చి 17: రైతన్నా మీ కోసం ఉత్సవాలలో భాగంగా రైతుల బ్యాంకు ఖాతాలలో వేసి అన్నదాత సుఖీభవ డబ్బులు వారి ఖాతాలలో పడినది లేనిది స్వయంగా రైతుల వద్దకే వెళ్లి అడిగి అమూల్య తెలుసుకున్నారు. పాడి పంటలు పరిస్థితి తెలుసుకొనడానికి సఖినేటిపల్లి మండలం వి.వి. మెరక గ్రామంలో రాజోలు టీడీపీ ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం సమావేశంలో గ్రామంలోని రైతులతో స్వయంగా ఆమె మాట్లాడారు.కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు.ఈ సందర్భంగా రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను కరపత్రం రూపంలో రైతులకు పంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు రాజు, సఖినేటిపల్లి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వై.మధుసూదనరావు, సఖినేటిపల్లి  మండల టీడీపీ అధ్యక్షులు తాడి సత్యనారాయణ, పులగం రమేష్, పప్పుల రమేష్, చెల్లుబోయిన నాగబాబు, చెల్లుబోయిన జయసూరిబాబు, కొల్లు మహాలక్ష్మి, యెనుముల రమణ, శ్రీధర్, చెల్లుబోయిన శ్రీనివాస్, గెద్దాడ వెంకటేశ్వరరావు, అంతర్వేదిపాలెం పుల్లయ్య, జానా పార్వతీశం, కొల్లు రాము, జిల్లెళ్ళ వెంకటేశ్వర్లు, అంతర్వేది పాలెం పెద్దిరాజు, జిల్లెళ్ళ పావెల్ రెడ్డి, నల్లి  సువర్ణ రత్నం, చిట్టూరి సంతోష్, తాడి రాము, పంగం సుధాకర్, పప్పుల శివప్రసాద్, నండూరి యువ కిషోర్, గొల్ల జస్పాల్,  చిగురుపాటి ఆనంద్ తదితర స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు, స్థానిక రైతు కుటుంబాలు, ప్రజలు పాల్గొన్నారు