
రాజోలు, మహిన్యూస్,మార్చి 17: అన్న దాత సుఖీభవ వారోత్సవాల్లో రాజోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కేతా వెంకటలక్ష్మి శ్రీనివాస్ పాల్గొన్నారు.రాజోలు మండలం,తాటిపాక గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా రైతులకు కరపత్రాలు పంపిణి చేసి, రైతులకు కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో రాజోలు వ్యవసాయ కమిటీ చైర్ పర్సన్ కేతా వెంకటలక్ష్మి శ్రీనివాస్ తో పాటు తెలుగు పార్టీ నాయకులు నాయకులు బొక్కా పృథ్వి, పితాని సూరిబాబు, గెడ్డం ప్రసాద్, సారిక ఆంజనేయులు, బైరిశెట్టి గణేష్, కనపాలరాముడు తదితరులు పాల్గొన్నారు. అలాగే రాజోలు మండలం, శివకోటి గ్రామంలో కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా రైతులకు కరపత్రాలు పంపిణి చేసి, రైతులకు కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు స్థానిక టీడీపీ నాయకులు వివరించారు.కూటమి ప్రభుత్వంతోనే రైతులకు అన్ని విధాలా మేలు కలుగుతుందని ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని టీడీపీ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్, క్లస్టర్ 4 ఇంచార్జి బందెల పద్మ, క్లస్టర్ 6 ఇంచార్జ్ మంగెన భూదేవి, విశేశ్వరాయపురం సర్పంచ్ హేలిన, క్లస్టర్ ఏడు ఇంచార్జ్ చాగంటి స్వామి,క్లస్టర్ 8 ఇంచార్జ్ కడలి మోహన్, అడబాల విజయ్, బూత్ కమిటీ కన్వీనర్ ముచ్చుపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.








Be the first to comment.