హైదరాబాద్,మహి న్యూస్ మార్చి 26: మనోబంధు జాతీయ అకాడెమిక్ కోఆర్డినేటర్ డా. యం
. సురేష్ బాబు మరియు జె. నిఖిల్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకృష్ణ రెడ్డిని కలిసి మనోబంధు కార్యక్రమానికి సంస్థాగత మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డా. సురేష్ బాబు, మనోబంధు సంస్థ ద్వారా, రోడ్డు సైడ్ వీధుల్లో తిరిగే మానసిక రోగులతో బాధపడుతున్న నిరాధారులను రక్షించడం, పునరావాసం కల్పించడం, సమాజంలో తిరిగి కలపడం వంటి మానవతా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమాలను కమ్యూనిటీ సర్వీస్ ప్రోగ్రాములు, సోషల్ ఇంటర్న్‌షిప్‌లు, విస్తరణ కార్యకలాపాలలో భాగంగా చేర్చేందుకు ఉన్నత విద్యాసంస్థలను ప్రోత్సహించాలని మండలిని కోరారు. ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి, మనోబంధు చేస్తున్న సేవలను అభినందించి, ఇది బలహీన వర్గాల గౌరవం మరియు మానవ హక్కులను కాపాడే జాతీయ స్థాయి సేవ అని పేర్కొంటూ పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.మానోబంధు కార్యక్రమం అక్టోబర్ 26, 2021న ప్రారంభమై, జూన్ 2022లో ట్రస్ట్‌గా నమోదు అయింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తోంది. ఈ కార్యక్రమం వీధుల్లో తిరిగే మానసిక రోగులను గుర్తించి, వారికి

25%50%75%100%Full↖ Left↔ Centre↗ Right
చికిత్స మరియు పునరావాసం కల్పించడంపై దృష్టి సారిస్తోంది.. ప్రారంభం నుండి ఇప్పటి వరకు మనోబంధు సుమారు 58 రెస్క్యూ డ్రైవ్‌లు నిర్వహించి, 380 మందికి పైగా వ్యక్తులను రక్షించింది. వారిలో దాదాపు 290 మందిని వారి కుటుంబాలతో తిరిగి కలిపింది. మిగిలినవారికి సంరక్షణ కేంద్రాలలో పునరావాసం కల్పిస్తోంది. ఈ కార్యక్రమానికి మున్సిపల్, పంచాయతీరాజ్ , పోలీస్ సామాజిక సేవ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు మద్దతు అందిస్తున్నారు. ఉన్నత విద్యాసంస్థలతో భాగస్వామ్యం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడంతో పాటు సమాజ సేవను మరింత బలోపేతం చేయవచ్చని డా. సురేష్ బాబు విశ్వాసం వ్యక్తం చేశారు.







Be the first to comment.