యానం, మహి న్యూస్, మార్చి 25.నియోజకవర్గ శివారు దరియాలతిప్ప గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కు ఆ గ్రామస్థులు బ్రహ్మరధం పట్టారు. బుధవారం రాత్రి దరియాలతిప్పలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాని దినేష్ తో కలిసి ఆయన విస్తృతప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. దరియాలతిప్ప ఐలాండ్-3 వద్ద గోదావరిలో ఒఎన్జసి గ్యాస్ పైప్ లైన్  గ్యాస్ లీక్ జరిగి తీవ్ర అగ్నిప్రమాదం జరిగిందని దీంతో గ్రామస్థులు బాధితులుగా మారారని రైతులు నాశనం అయ్యారని అన్నారు. బాధితులు తమ డిమాండ్ల సాధనకై ఒఎన్ జిసి పరిహారం కోసం సుమారు 5 నెలల నుంచి దరియాలతిప్ప, దొమ్మేటిపేట, బాలయోగికాలనీ, సీతారామనగర్ గ్రామస్థులు నిరంతరం ధర్నా చేస్తుంటే పుదుచ్చేరి సిఎం రంగసామి యానాం పర్యటనకు వచ్చి కూడా ధర్నావద్దకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఒఎన్జసి పరిహారం ఇస్తామని ఇచ్చినప్రకటనలు అన్నీ అవాస్తవమని గ్రామస్థులను రంగసామి, మల్లాడి మోసం చేసారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. అయితే ధర్నా వద్దకు వచ్చి బాధితులతో మాట్లాడిన ఎంపి వైథిలింగంను గో బ్యాక్ అంటూ వెనుకకు పంపించి వేశారన్నారు. అందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని హస్తం గుర్తుకు ఓటు వేయాలని పుదుచ్చేరి సిఎంగా వైధిలింగం అవుతారని అన్ని పనులు పూర్తవుతాయన్నారు. అంతకముందు గ్రామంకు వచ్చిన అశోక్ కు గ్రామస్థులు పూలవర్షం కురిపించారు. బాణాసంచా కాల్పులతో దరియాలతిప్ప మారుమ్రోగింది.
25%50%75%100%Full↖ Left↔ Centre↗ Right