ప్రకాశం జిల్లా, మహి న్యూస్, మార్చి 25 : బుధవారం గుడ్లూరుకు చెందిన దేవరకొండ వెంకాయమ్మ తన బ్రాస్లెట్‌ను మాచవరం బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడానికి వెళ్లింది. అయితే బ్యాంకులో పని పూర్తికాకపోవడంతో తిరిగి గుడ్లూరుకు రావడానికి ఏపీ 27 టీ జెడ్ 0808 నంబర్ బస్సులో ఎక్కింది. ఆ సమయంలో తన గోల్డ్ బ్రాస్లెట్ (సుమారు 2 లక్షల గల)ను బస్సులో మర్చిపోయి గుడ్లూరులో దిగింది.
ఈ విషయాన్ని గుడ్లూరు పోలీస్ స్టేషన్‌లో తెలియజేయగా, అక్కడ ఉన్న డబ్ల్యూపీసీ ఉషారాణి, పీసీ లక్ష్మణ స్వామి, డ్రైవర్ సురేంద్ర వెంటనే ఎస్‌ఐ వెంకట్రావు కి సమాచారం అందించారు. అనంతరం వారు బస్సు కండక్టర్‌ను సంప్రదించారు.
ఈలోపు బస్సు కండక్టర్ తన సీటులో ఉన్న బ్రాస్లెట్‌ను గుర్తించి, దాన్ని భద్రంగా తన వద్ద ఉంచుకుని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం కండక్టర్ నిజాయితీగా గోల్డ్‌ను గుడ్లూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి, బాధితురాలు దేవరకొండ వెంకాయమ్మకు అప్పగించారు.ఈ సందర్భంగా వెంకాయమ్మ మరియు ఆమె కుటుంబ సభ్యులు బస్సు కండక్టర్ చంద్రమోహన్ రావు కి, డ్రైవర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంఘటనలో నిజాయితీగా వ్యవహరించిన బస్సు కండక్టర్ చంద్రమోహన్ రావు మరియు డ్రైవర్ ను ఎస్సై సత్కరించారు









Be the first to comment.