ప్రపంచ కవిత్వ దినోత్సవం సందర్భంగా


వృక్షరాజుల వక్షస్థలమున్

వాయువు విహరించు వేళ,

మంజుల మానస సారమై

పత్తిపాటి పలుకు పరిమళించె;

ప్రకృతి పరిరక్షణే పరమధర్మం—

ప్రపంచ కవిత్వ దినోత్సవానికి

స్వాగతం పలుకుదాం రండీ॥


నీలాంబర తలపాగ మిద

నక్షత్ర హారముల కాంతి,

మంజుల కవిత్వ దీప్తిగా

పత్తిపాటి భావ రేఖలై మెరిసె;

భూమాత వేదన వినిపించున్—

స్వాగతం పలుకుదాం రండీ॥


సరిత్సాగర గర్భమున్

సంరక్షణ స్వరమెల్ల వినిపించగా,

మంజుల హృదయ తంత్రులపై

పత్తిపాటి రాగమాల విరిసె;

జలమే జీవన మూలం—

స్వాగతం పలుకుదాం రండీ॥


పుష్పిత వనరాజుల లోకమున్

పక్షి గానామృతమెల్ల పారగా,

మంజుల సుగుణ సాన్నిధ్యమై

పత్తిపాటి పద్య కుసుమముల విరిసె;

ప్రకృతి లాలనలోనే శాంతి—

స్వాగతం పలుకుదాం రండీ॥


భూమండల మాతృమూర్తి

బాధతో మౌనమై నిలిచిన వేళ,

మంజుల కరుణారస గంభీరమై

పత్తిపాటి వాక్యామృతమై పొంగె;

మనసారా కాపాడుదాం భూదేవిని—

స్వాగతం పలుకుదాం రండీ॥




✍️ రచన: మంజుల పత్తిపాటి

📞 చరవాణి: 9347042218

📍 యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ